క్రైమ్/లీగల్

మహిళా పోలీసు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావెల్లిక్కార (కేరళ), జూన్ 15: పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌ను మరో ట్రాఫిక్ పోలీసు వెంటాడి, వేటాడి, కత్తితో దాడి చేసి ఆ తర్వాత పెట్రోలు పోసి సజీవంగా దహనం చేశాడు. ఈ హృదయవిదారకర ఘటన కేరళలో జరిగింది. వల్లిక్కున్నం పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం విధులు ముగించుకున్న మహిళా కానిస్టేబుల్ సౌమ్య పుష్పాకరన్ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. కాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కారులో ఆమెను వెంటాడుతూ వెళుతూ, దారిలో ఆమె ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆమె నేలపై పడిన వెంటనే కారు దిగి పదునైన కత్తితో ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఆమెపై పోసి నిప్పంటించాడు. మహిళా కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించగా, ఈ పెట్రోలు దాడితో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా 40 శాతం వరకు మంటలు అంటుకుని గాయపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దాడికి గల కారణాలను విచారణ తర్వాతే వెల్లడించగలమని పోలీసు అధికారులు తెలిపారు. మరణించిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త విదేశంలో ఉద్యోగం చేస్తున్నారు.