క్రైమ్/లీగల్

మహిళపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 15: తీసుకున్న అప్పు చెల్లించలేదనే కారణంతో ఒక మహిళను కొంతమంది వ్యక్తులు ఇంటిలో నుంచి జడ పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చి బెల్టుతో చితకబాదారు. పిడిగుద్దులు గుద్దినారు. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనలో దాడి చేసిన వారిలో ఒక కాంగ్రెస్ నాయకుడి సోదరుడు కూడా ఉన్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాలలో హల్‌చల్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రూ. 23వేలు అప్పుగా తీసుకొని చెల్లించలేదనే కారణంతో 35 ఏళ్ల మహిళను చితకబాదడం రాష్ట్రంలో దుమారం లేపింది. ముక్త్‌సర్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడయిన కాంగ్రెస్ నాయకుడి సోదరుడు కూడా ఈ దాడిలో పాల్గొన్నాడు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. దాడికి గురయిన మహిళ.. కౌన్సిలర్ సోదరుడు అయిన సురేశ్ చౌదరికి రూ. 23వేలు ఇవ్వాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయంలోనే దాడి చేశారని చెప్పారు. చౌదరి, మరో అయిదుగురిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని వారు వివరించారు. వీరందరిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.