క్రైమ్/లీగల్

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 31: అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసిన కేసులో వికారాబాద్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. వికారాబాద్ సీఐ ఎం.వెంకట రామయ్య తెలిపిన వివరాల ప్రకారం 2014 ఆగస్టు 21న వికారాబాద్ పట్టణం గంగారానికి చెందిన పర్వీన్‌బేగంను భర్త ఎండీ హాజీ, అత్త హుస్సేన్‌బీ అదనపు కట్నం కోసం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. అప్పటి సీఐ వీ.లచ్చిరాం కేసు దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణగౌడ్ వాదనలు వినిపించగా, శనివారం జిల్లా అదనపు కోర్టు జడ్జి కే.రంగారావు ఇద్దరికి జీవిత ఖైదు, రెండు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.