క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 16: డబ్బు కోసం వృద్ధ దంపతులను హత్య చేసి, అనంతగిరి అటవీ ప్రాంతంలో మృతదేహాలను పారవేసిన సంఘటన వికారాబాద్‌లో ఆదివారం వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించి ధారూరు సీఐ దాస్ తెలిపిన వివరాల ప్రకారం పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన నవరతన్ రెడ్డి(76) భార్య స్నేహలత రెడ్డి(72) ఇటీవల బీదర్ జిల్లా హుమ్నాబాద్ ప్రాంతంలో 55 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడే అద్దెకు ఉంటూ భూమిని డెవలప్ చేస్తున్నారు. హుమ్నాబాద్ ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్‌ను డ్రైవర్‌గా నియమించుకున్నారు. సతీష్ కుమార్ నమ్మకంగా ఉన్నాడు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి కారులో బయల్దేరగా, కారులో నవరతన్ రెడ్డి, స్నేహలతా రెడ్డి నిద్రిస్తున్న సమయంలో సతీష్ కుమార్, అతని స్నేహితుడు రాహుల్ కలిసి వారిద్దరిని టవల్‌తో గొంతు బిగించి హత్య చేసి అనంతగిరి అటవీ ప్రాంతంలో పడేశార్పు. దంపతుల వద్ద ఉన్న రూ.32వేలు నగదు, బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. మృతులకు సంబంధించి హుమ్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆదివారం వికారాబాద్ అనంతగిరి అడవికి నిందితులను తీసుకుని వచ్చి మృతదేహాలను కనుగొని పోస్టుమార్టం నిమిత్తం హమ్నాబాద్ ఆసుపత్రికి తరలించారు.