క్రైమ్/లీగల్

హాస్టల్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జూన్ 16: హాస్టల్ పైనుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాకు చెందిన స్వాతినక్షత్ర(25)కు రెండేళ్ల క్రితం భవానీ చౌదరితో వివాహం జరిగింది. కొంత కాలం క్రితం వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. స్వాతి వెస్ట్‌శ్రీనివాస్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుండగా, అదే ప్రాంతంలో భవాని చౌదరి ఓ మెస్‌ను నడుపుతున్నాడు. ఆదివారం స్వాతి తాను నివాసం ఉంటున్న హాస్టల్ మూడవ అంతస్తు పైనుంచి దూకింది. తీవ్రగాయాలపాలైన ఆమెను హాస్టల్ నిర్వాహకులు, స్థానికులు.. హుటాహుటిన బేగంపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.