క్రైమ్/లీగల్

నిందితుల శిక్ష సరైనదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జూన్ 17: జమ్మూలో ఎనిమిదేళ్ల బాలిక కతువాపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన ఆరుగురు దుండగుల ఉదంతాన్ని ప్రత్యేక కోర్టు తీవ్రంగా ఖండించింది. నిందితులైన ఆరుగురు చేసిన ఈ దుష్టాంతాన్ని ‘అమానవీయం, హేయం, ఆటవికం’ అని కోర్టు అభివర్ణించింది. హంతకులు ఆరుగురికీ ఈనెల పదో తేదీన విధించిన శిక్ష సరైందేనని జిల్లా సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెషన్స్ కోర్టు బాలిక హత్య కేసును విచారించింది. ఈ కేసులో సంజీ రామ్, డిస్మిస్ అయిన పోలీసు దీపక్ ఖజూరియా, పర్వేష్‌కుమార్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష పడిన సంగతి తెలిసిందే. ‘స్వర్గం లేదా నరకం అనేవి నైసర్గిక ప్రదేశాలు కావనీ.. అవి మన ఆలోచనలు, చేసే పనులు, లక్షణాలను బట్టి నిర్ణయం అవుతాయి’ అని జడ్జి డాక్టర్ తేజ్వీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 432 పేజీల తీర్పులో మొదటి పేజీలో పై విధంగా జడ్జి పేర్కొన్నారు. బాలిక హత్యోదంతంలో ఆరుగురు నిందితులు వ్యవహరించిన తీరు అమానుషం, ఆటవికం, హేయం అని అభివర్ణిస్తూ.. వీరికి పడిన శిక్ష సరైనదేనని అభిప్రాయపడ్డారు. ఆరుగురు నిందితులకు పడిన శిక్ష అంశం సమాజానికి సరైన సంకేతాలే పంపుతుందని జడ్జి పేర్కొన్నారు.