క్రైమ్/లీగల్

గ్రామ దేవతల జాతరలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, జూన్ 17: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ దేవతల జాతర ముగింపు నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనోత్సవంలో భాగంగా వెస్ట్ కుక్కులేరు డ్రెయినులో స్నానం చేస్తున్న సమయంలో నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మునిగిపోతున్న మరో నలుగురిని స్థానికుడు ఒకరు రక్షించారు. వివరాలిలావున్నాయి... పేరుపాలెం నార్త్‌గ్రామంలో గ్రామ దేవతలు శ్రీకనకదుర్గమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లజాతర ఆదివారం రాత్రి ముగిసింది. సోమవారం స్థానికంగా ఉన్న వేస్ట్‌కుక్కులేరు డ్రెయినులో అమ్మవార్లను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు డ్రెయినులో సామూహికంగా స్నానాలు చేశారు. అయితే ఆ సమయంలో ఆరుగురు యువకులు నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన కేతా విజయకుమార్ అనే యువకుడు వారిని రక్షించే ప్రయత్నంచేశాడు. వారిలో నలుగురిని విజయకుమార్ రక్షించగా, కవురు సురేష్ (23), దొంగ రమేష్ (21)నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపుచర్యలు చేపట్టారు. మూడు గంటల అనంతరం సురేష్, రమేష్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొగల్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.