క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 1: మండలంలోని వేగవరం సమీపంలోని పెట్రోలు బంకు వద్ద రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యింది. మోటార్ సైకిల్‌ను పామాయిల్ ఫ్యాక్టరీకి చెందిన లారీ వెనుక నుండి ఢీకొనడంతో మోటార్ సైకిల్ వెనుక కూర్చొన్న చీదర రాధ (29) లారీ చక్రాల కింద పడిపోయింది. చక్రాలు ఆమె తలపై నుండి, శరీరంపై నుండి ఎక్కి వేయడంతో దుర్మరణం పాలయ్యింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త గణేష్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. దుర్మరణం పాలైన రాధ తొమ్మిది నెలల గర్భవతి కావడంతో గ్రామస్థులు తీవ్రంగా కలత చెందారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. విశాఖపట్నం జిల్లా మూలపేట మండలం గడ్డిచంద గ్రామానికి చెందిన చీదర గణేష్, రాధ దంపతులు వేగవరం సమీపంలోని మాదాసు శ్రీనుకు చెందిన కోళ్ళ ఫారంలో పనిచేసేందుకు వచ్చారు. గత ఏడాదిగా పొలంలోని కోళ్ళ ఫారంలో మకాం ఉంటూ జీవిస్తున్నారు. వీరి ఇంటికి బంధువులు రావడంతో ఉదయం పొలం నుండి మోటార్ సైకిల్‌పై భార్య రాధతో కలిసి వేగవరం సెంటర్‌కు వస్తుండగా వెనక నుండి మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొంది. ఢీకొన్న సమయంలో చక్రాల కిందకు రాధ పడిపోవడంతో చక్రాలు ఆమె మీద నుండి ఎక్కివేశాయి. అదే సమయంలో గణేష్ ఎడమ వైపునకు పడిపోవడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం రాధ బంధువుల రోదనలతో నిండిపోయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌ఎ స్వామి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. భర్త గణేష్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై జి.జె.విష్ణువర్థన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.