క్రైమ్/లీగల్

స్పూఫ్ కాల్స్‌తో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం): ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్ ఫోన్ నెంబర్ ద్వారా కాల్ చేసి ఇద్దరు శాసనసభ్యులను బురిడీ కొట్టించి రూ.25 లక్షలను కాజేసిన నలుగురు సైబర్ నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పోలీసు కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో మోసం వివరాలను పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా తెలియజేశారు. గాజువాక పరిధిలో నివాసముంటున్న పాండ్రంగి విష్ణుమూర్తి (27), గంధవరపు తరుణ్‌కుమార్ (30), పిల్లా జయకృష్ణ (24), మరడాన జగదీష్ (24) కలిసి స్పూఫ్ కాల్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్ (పిఏ)ను కాల్ చేస్తున్నానని చెప్పి, సార్ డబ్బులు పంపించమన్నారు అని నమ్మిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల ఆరో తేదీన పలాస శాసనసభ్యుడు శీదిరి అప్పలరాజుకు స్పూఫ్ కాల్ చేసి రూ.15లక్షలు ముఖ్యమంత్రి జగన్ అడుగుతున్నారని చెప్పి జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి ఫోన్ నెంబర్ ద్వారా పైన పేర్కొన్న నిందితులు చేశారు. వాట్సాఫ్ మెసేజ్‌ల ద్వారా రూ.100నోటును నగదు లావాదేవీలకు గుర్తింపుగా పంపి మర్రిపాలెం, అన్న క్యాంటీన్ వద్ద నోటులోని నెంబర్ చూపించిన వారికి ఇవ్వాలని తెలిపారు. ముఖ్యమంత్రి పీఏ నుండి వచ్చిన కాల్‌గా భావించిన ఎంఎల్‌ఎ అప్పలరాజు 15 లక్షల రూపాయలను వారికి అందజేశాడు. తర్వాత మోసపోయినట్టు తెలుసుకున్న ఎమ్మెల్యే అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే గత నెల ఏడో తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీఏ శ్రీనివాస్ నెంబర్ నుండి పెందుర్తి ఎంఎల్‌ఏ బండారు సత్యనారాయణకు స్పూఫ్ కాల్ చేసి, పై తరహాలో రూ.పది లక్షలను నిందితులు అడిగారు. ముఖ్యమంత్రి పీఏ కాల్‌గా భావించి నమ్మి నగదును సత్యనారాయణ తన డ్రైవర్ సన్యాసినాయుడు ద్వారా స్టీల్‌ప్లాంట్‌వద్ద గుర్తు తెలియని వ్యక్తికి రూ.పది లక్షలను అందజేశాడు. మోసపోయినట్టు తెలుసుకున్న ఎంఎల్‌ఏ సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపధ్యంలో దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు నిందితులను ఐపి అడ్రస్ ద్వారా గుర్తించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి రూ.5,80,000లను, 28.22గ్రాముల బంగారం, 19.24గ్రాముల వెండి వస్తువులను, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ప్రధాన నిందితుడు విష్ణుమూర్తి ఇంజనీరింగ్ చదువును మధ్యలో ఆపివేయగా, మిగిలిన వారు ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం. కేసు దర్యాప్తులో చురుగ్గా పనిచేసిన సైబర్ క్రైం పోలీసులను సీపీ అభినందించారు.