క్రైమ్/లీగల్

పసికందుపై పైశాచికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న పసికందుపై ఒక మానవ మృగం అమానుష చర్యకు పాల్పడింది. చెప్పడానికి, రాయడానికి వీలులేకుండా తొమ్మిది నెలల ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆ చిన్నారి మృతికి కారణమయ్యాడో కామాంధుడు. ఈ అమానుష సంఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. రాత్రి పూట డాబాపై నిద్రిస్తున్న దంపతుల పక్కలో నుండి 9 నెలల పసిపాపను ఎత్తుకెళ్లాడో కామాంధుడు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేశాడు. ఈ దారుణాన్ని తెలుసుకున్న మహిళా సంఘాలు, స్థానిక యువకులు ఆందోళనలకు దిగారు. నిందితున్ని వదిలివేయరాదని.. కఠినాతికఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జక్కోజు జగన్-రచన దంపతుల కుమార్తె శ్రీహిత (9నెలలు)తో తమ ఇంటి బంగ్లాపై నిద్రించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొలనుపాక ప్రవీణ్ అనే వ్యక్తి బిల్డింగ్‌పైకి వెళ్లి పాపను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రలో నుండి మేల్కొని చూసేసరికి పాప కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. బంగ్లాపై పక్కనే స్పృహ తప్పి కనిపించడంతో గుండెలవిసేలా విలపిస్తూ పాపను చేతిలోకి తీసుకొని పరిశీలించగా తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో హుటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పాపను పరిశీలించి పాప మరిణించినట్టు నిర్ధారించారు. కాగా, తొమ్మిది నెలల పసిపాపపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు ప్రవీణ్‌ను స్థ్ధానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. జరిగిన దారుణం నగరంలో దాహనంలా వ్యాపించడంతో సంఘటనా స్థలానికి మహిళా సంఘాలు, యువకులు, విద్యార్థి లోకం తరలివచ్చారు. హన్మకొండ చౌరస్తాలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు అందోళన కారులను శాంతింపజేశారు. నిందితుడు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. నిందితుడిపై 366, 302, 376ఎ, 376ఎబీ, 379, ఐపీసీ సెక్షన్లతోపాటు 5 (యం) రెడ్ విత్ 6 ఆఫ్ పొక్సో యాక్ట్ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

చిత్రాలు.. .తొమ్మిది నెలల చిన్నారి *నిందితుడు ప్రవీణ్ (ఫైల్‌ఫొటోలు)