క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలపై పిటిషన్‌ను విచారించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఇప్పటికప్పుడు నిర్వహించలేమని, మరో ఐదు నెలల పాటు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు హైకోర్టులో పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన మూడు పిటిషన్లను హైకోర్టు బుధవారం నాడు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మున్సిపాల్టీల కాలపరిమితి ముగుస్తున్నందున రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం తన కౌంటర్‌ను దాఖలుచేయాలని గత పక్షం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌కుమార్ ఆదేశించారు. పిటిషనర్ తరఫున కేజీ కృష్ణమూర్తి, ధర్మేశ్ జైస్వాల్‌లు, ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ కే రామచంద్రరావులు తమ వాదనలు వినిపించారు. వచ్చే నెల రెండో తేదీ నాటికి మున్సిపాల్టీల గడువు ముగుస్తుందని రాజ్యాంగంలోని 243 (3) అధికరణం ప్రకారం ఐదేళ్లకో మారు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు లాంటి చర్యలను చేపట్టలేదని పిటిషనర్ వాదించారు.