క్రైమ్/లీగల్

అక్రమంగా గుట్కాలను నిలువ చేసి విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 19: నిషేధిత గుట్కాలను అక్రమంగా నిలువ చేసి విక్రయస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి గుట్కా పాకెట్లను, నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి చౌదరిగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం.. చౌదరిగూడ పంచాయతీ యాదాద్రి కాలనీలోని ఇంట్లో కుమావత్ రామ్‌నివాస్ (22), కుమావత్ చంపాలాల్(32), కుమావత్ ముఖేష్(22) లు గత కొంత కాలంగా ప్రభుత్వం నిషేధించిన వివిద రకాల గుట్కాలను నిలువ చేసి అమ్ముతున్నట్లు తెలిపారు. అక్రమంగా గుట్కాలను అమ్ముతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఎస్‌ఐ విజయకృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం దాడి జరిపినట్లు తెలిపారు. దాడిలో రూ. 2.10.000 విలువ గల వివిధ రకాల గుట్కా, పోగాకు పదార్ధాల పాకెట్లు, రూ.1.3000 నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు.