క్రైమ్/లీగల్

జిల్లాలో 326 స్కూల్ బస్సులు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జూన్ 19: నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న 532 బస్సులపై కేసులు నమోదు చేసి 326 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ మీరాప్రసాద్ తెలిపారు. బుధవారం గన్నవరంలో పాఠశాలల, కళాశాలల బస్సులను విస్తృత తనిఖీలు చేశారు. రవీంద్రభారతి స్కూల్ బస్సుకు మెట్టు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డ్రైవర్‌కు 60 సంవత్సరాలు నిండినందునా అతనిపై కేసు నమోదు చేశారు. తెలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ బస్సులో సామర్ధ్యానికి మించి అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించిన నేరానికి కేసు నమోదు చేశారు. ఈసందర్భంగా డీటీసీ మాట్లాడుతూ జిల్లాలో 256 పాఠశాలలు ఉండగా 2,348 బస్సులు రెన్యువల్ చేయించుకున్నారన్నారు. మరో 508 బస్సులు ఇంకా రెన్యూవల్ చేయించుకోలేదన్నారు. ఈబస్సులను పక్కన పెట్టినచో వారి వివరాలను తమ కార్యాలయంలో తెలపాలన్నారు. అప్పుడే ఆబస్సులు పాఠశాల కేటగిరి నుంచి తొలగిస్తామన్నారు. లేనిచో ఆయా బస్సులు పాఠశాల బస్సులుగానే పరిగణిస్తామన్నారు. రెన్యూవల్ చేయని బస్సులు రోడ్డెక్కితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు ఎక్కే బస్సులకు మెట్లు కిందకు ఉండాలన్నారు. అలాలేని కారణంగా ఒక బస్సుపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గత 12వ తేదీ నుండి పాఠశాల బస్సులపై దాడులు ముమ్మరం చేశామన్నారు. ఈ దాడుల్లో మీరాప్రసాద్‌తో పాటు ఎంవిఐ హరినాద్‌రెడ్డి, కె వెంకటేశ్వరరావు, జి స్వామి, ఎఎంవిఐలు కె శివరామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.