క్రైమ్/లీగల్

వ్యక్తి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సి.బెళగల్, ఏప్రిల్ 1:మండల పరిధిలోని సింగవరం గ్రామం సమీపంలో ఆదివారం తుంగభద్ర నదిలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన నరసింహులు(45)గా గుర్తించి అతడి భార్య ఈశ్వరమ్మకు సమాచారం ఇవ్వగా ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి
కోడుమూరు, ఏప్రిల్ 1:మండల పరిధిలోని ప్యాలకుర్తి, కొత్తూరు గ్రామాల మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరు మండలం ముగితి గ్రామానికి చెందిన వీరేష్(34) మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. వీరేష్ అతడి మామ రామాంజినేయులుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు బయల్దేరారు. ఈక్రమంలో వారు కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి, కొత్తూరు గ్రామాల దగ్గర వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో వీరేష్ అక్కడికక్కడే మృతి చెందగా, రామాంజినేయులు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే కోడుమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రామాంజినేయులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.