క్రైమ్/లీగల్

మావోల చేతిలో ఎస్పీ నేత హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 19: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్యంలోని బీజాపూర్ జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీ నేత పూనెం సంతోష్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ తరుపున సంతోష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంతోష్ గుత్తేదారుడిగా పలు నిర్మాణ పనులు చేపడుతున్నారు. బీజాపూర్ జిల్లాలోని ఇల్‌మిడి పోలీసుస్టేషన్ పరిధిలో మారెమళ్ల గ్రామానికి చెందిన సంతోష్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన పథకంలో భాగంగా లోథేడ్-మారెమళ్ల గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులను ఇటీవల చేపట్టారు. ఈ రహదారి నిర్మాణ పనులు ఆపాలని కొంతకాలంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంతోష్ మావోయిస్టుల హిట్‌లిస్టులో కూడా ఉన్నారు. అయితే మంగళవారం సాయంత్రం రహదారి నిర్మాణ పనులు చూసేందుకు వెళ్లిన సంతోష్‌ను మావోలు కిడ్నాప్ చేశారు. సంఘటన స్థలంలో రహదారి నిర్మాణానికి ఉపయోగిస్తున్న డోజర్, జేసీబీ, ట్రాక్టర్, బోలేరా వాహనాలకు నిప్పు పెట్టిన అనంతరం సంతోష్‌ను కాల్చి చంపారు. ఇల్‌మిడి పోలీసుస్టేషన్‌కు 15కి.మీ. దూరంలో ఈ ఘటన చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కాగా సంతోష్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన భార్య, సోదరుడు వెళ్లగా మావోయిస్టులు వెనక్కు పంపించేశారు. దీంతో భద్రతా బలగాలను మారెమళ్ల అటవీ ప్రాంతానికి పంపించామని యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీజీ సుందర్‌రాజ్, బీజాపూర్ ఎస్పీ దివ్యాంగ్‌పటేల్ తెలిపారు.

సమాజ్‌వాదీ పార్టీ నేత పూనెం సంతోష్‌ (ఫైల్‌ఫొటో )