క్రైమ్/లీగల్

బెయిల్ ఇవ్వాలంటూ శివాజీ క్వాష్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: సినీ నటుడు శొంఠినేని శివాజీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని శివాజీ క్వాష్ పిటీషన్ ద్వారా విన్నవించారు. పోలీసులు ముందస్తు అరె స్టు చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఈ కేసులో రవి ప్రకాష్ దాఖ లు చేసిన పిటీషన్‌పై తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా తమ వాదన వినిపించేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇంత వరకూ శివాజీకి మూడు మార్లు నోటీసులు జారీచేసినా, పోలీసుల విచారణకు ఆయన హాజరుకాలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు గడువుకావాలని ఆయన చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది.