క్రైమ్/లీగల్

పరిహారం ఇవ్వమని ఆదేశించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ఇంటర్మీడియట్ మూల్యాంకనం, ఫలితాల్లో నెలకొన్న గందరగోళంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశించలేమని హైకోర్టు ధర్మాసనం బుధవారం నాడు తేల్చి చెప్పింది. ఇంటర్మీడియట్ మూల్యాంకనం, ఫలితాల్లో గందరగోళం జరిగిందని, దాంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని పేర్కొంటూ బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు హైకోర్టులో ప్రజావాజ్య పిటీషన్‌ను దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దానిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇంటర్మీడియట్ బోర్డును, పోలీసు కమిషనర్‌ను, విద్యాశాఖ కార్యదర్శిని, ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆదేశించింది. గందరగోళంపై విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించడమేగాక, ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించాయి. దాంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థుల సమాధాన పత్రాలను ఉచితంగా రీ వెరిఫికేషన్ నిర్వహించాలని బోర్డును ఆదేశించారు. మరో పక్క రీ వెరిఫికేషన్ పత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, వాటిని ఇంటర్ నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా స్కానింగ్ చేసి ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఫెయిలైన వారి జవాబు పత్రాలను, కొత్తగా మార్కుల పెరుగుదలకు దరఖాస్తు చేసుకున్న వారి జవాబుపత్రాలను బోర్డు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహించి వాటి నివేదికలను, జవాబుపత్రాలను సైతం నెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. రీ వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత 1124 మంది ఉత్తీర్ణులు కావడం, ఆత్మహత్యకు పాల్పడిన అనామిక అనే విద్యార్థిని మార్కులను రీ వెరిఫికేషన్ అనంతరం పెరిగాయని అప్‌లోడ్ చేయడం, పెరిగిన మార్కుల ప్రకారం ఆమె ఉత్తీర్ణురాలైందని భావించిన అనామిక సోదరి, ఇతర కుటుంబ సభ్యులు బోర్డు అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించడంతో ఇంటర్ వ్యవహారాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు సైతం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఎవరూ రీ వెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులు కాలేదని, కేవలం 0.16 శాతం మాత్రమే మిగిలిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని నివేదించింది. ఉభయపక్షాల వాదనలు విచారించిన హైకోర్టు చివరికి ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు పరిహారం విషయంలో తామేమీ జోక్యం చేసుకోలేమని, ఆ అంశాన్ని ప్రభుత్వమే ఆలోచించాలని పేర్కొంది.