క్రైమ్/లీగల్

లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామ్‌నగర్, జూన్ 20: లాకప్ డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్‌భట్‌కు స్థానిక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1990లో జామ్‌నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించినప్పుడు ఆయన లాకప్‌డెత్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2002 గోద్రా అల్లర్లలో అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయమేమీ లేదని ఒక కేసులో ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. కాగా, మాదక ద్రవ్యాలు కలిగివున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2011లో భారత పోలీస్ సర్వీస్ ఆయనను బర్తరఫ్ చేసింది. 2015 ఆగస్టులో కేంద్రం హోం మంత్రిత్వ శాఖ భట్‌ను అన్ని రకాల సేవల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా వుంటే సుమారు 29 సంవత్సరాల క్రితం జరిగిన లాకప్‌డెత్ కేసులో తీర్పు వెలువడింది. జామ్‌నగర్ కోర్టు న్యాయమూర్తి బీఎన్ వ్యాస్ ఈ కేసుపై తీర్పు వెల్లడిస్తూ భట్ నేరానికి పాల్పడినట్లు రుజువయిందని ప్రకటించారు. అతనితో పాటు కానిస్టేబుల్ ప్రవీన్ష్ కూడా ఐపీసీ 302 సెక్షన్ కింద నేరం చేసినట్టు తెలిపారు. వీళ్లిద్దరికీ జీవిత ఖైదు విధించారు. అదే విధంగా సబ్ ఇన్స్‌పెక్టర్ దీపక్‌షా, శైలేష్ పాండ్యా, కానిస్టేబుల్స్ అనోప్సీన్ జెత్వా, కేశుభా జడేజా, ప్రవీన్ష్ జడేజాలకు తలా రెండేళ్ల జైలు శిక్ష విధించారు. నేరారోపణ జరిగిన సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఈ తీర్పు వెలువడడం గమనార్హం.