క్రైమ్/లీగల్

ఏఎన్-32 విమాన దుర్ఘటనలో ఆరు మృతదేహాలు వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, జూన్ 20: అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఏఎన్-32 విమాన ప్రమాద ఘటనకు సంబంధించి గల్లంతైన వారిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాదానికి గురైన రష్యన్ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ఈ ఆరుగురి మృతదేహాలను సియాంగ్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కనుగొన్నారని సహాయ బృందాలు వెల్లడించాయి. సియాంగ్ డిప్యూటీ కమిషనర్ రాజీవ్ తాకూక్ కథనం మేరకు మరో ఏడుగురిని కనుగొనాల్సి ఉంది. ఆరుగురి మృతదేహాలను అస్సాంలోని ఐఏఎఫ్‌కు చెందిన జోరాత్ ఎయిర్‌బేస్‌కు గురువారం తరలించారు. అరుణాచల్ పర్వత శ్రేణుల్లో సమాచార వ్యవస్థ క్లిష్టతరంగా మారిన నేపథ్యంలో విమాన శకలాలను కనుగొనడంలో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. విమానం కూలిన ప్రాంతం నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌తో పాటు బ్లాక్ బాక్స్‌ను గత వారం కనుగొన్నారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో గాలింపు చర్యలు ఉద్ధృతం చేయగలిగామని సియాంగ్ అధికారి పేర్కొన్నారు. దుర్ఘటన ప్రాంతం నుంచి రావడానికి రోడ్డు మార్గం కానీ, కమ్యూనికేషన్ సదుపాయం కానీ లేదని ఆయన వివరించారు. 13మందితో జోరాత్ నుంచి వెళ్లిన ఏఎన్ 32 విమానం ఈనెల మూడో తేదీన పర్వత శ్రేణుల్లో గల్లంతైన సంగతి విదితమే.