క్రైమ్/లీగల్

ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌గఢ్, జూన్ 20: చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒక అడవి ఏనుగు ఇద్దరిని తొక్కి చంపింది. ఈ ఇద్దరిలో ఒకరు ఫారెస్ట్ గార్డ్ ఉన్నారని అధికారులు గురువారం తెలిపారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) ప్రణయ్ మిశ్రా కథనం ప్రకారం, ఫారెస్ట్ గార్డ్ ముకేశ్ పాండే (32) బుధవారం పోడి గ్రామానికి వెళ్లాడు. ఆ ప్రాంతంలో అడవి ఏనుగు తిరుగుతోందని, అందువల్ల ఏనుగుకు ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు చెప్పి, తిరుగు పయనం అయ్యాడు. గ్రామ సమీపంలో అతనికే అడవి ఏనుగు ఎదురుపడింది. వెంటనే ఆ ఏనుగు తన తొండముతో ముకేశ్‌ను పట్టుకొని నేలకేసి కొట్టింది. తరువాత తన కాళ్లతో అతడిని తొక్కి చంపింది. తరువాత అక్కడికి సమీపంలో గల కొట్మార్ గ్రామం వద్ద అదే ఏనుగు అయిదుగురు గ్రామస్తులపై దాడి చేసింది. ఒకరి అంత్యక్రియలకు హాజరయి గ్రామానికి తిరిగి వస్తున్న వారిపై ఏనుగు దాడి చేసింది. అయితే, వారిలో నలుగురు తప్పించుకొని పారిపోగలిగారు. ఏనుగు భుజేంద్ర రాథియా (22) అనే యువకుడిని తన తొండముతో పట్టుకొని, కాళ్లతో తొక్కి చంపింది. తరువాత అటవీ, పోలీసు సిబ్బంది రెండు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. అయితే, ఆ ఏనుగు చాలా సేపు అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండటం వల్ల మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం ఆలస్యమయింది. పోస్టుమార్టం అనంతరం గురువారం ఇద్దరి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అటవీ శాఖ ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 4లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించింది.
గ్రామస్తుడు, ఫారెస్ట్ గార్డ్‌పై దాడి చేసిన ఏనుగు తన గుంపు నుంచి విడిపోయినట్టు కనపడుతోందని, గత కొన్ని రోజుల నుంచి అది గ్రామాల చుట్టూ తిరుగుతోందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని స్థానికులను హెచ్చరించడం జరిగిందని డిఎఫ్‌ఓ తెలిపారు. దట్టమయిన అడవులు గల ఉత్తర చత్తీస్‌గఢ్‌లో గతంలోనూ ఏనుగులు, మనుషులు ఎదురుపడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.