క్రైమ్/లీగల్

డోన్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, ఏప్రిల్ 1:డోన్ పట్టణంలోని ఇందిరానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు గోపాల్ శర్మ ఇంట్లో దొంగలు పడి బీభత్సం సృష్టించారు. గోపాల్‌శర్మ ఇంట్లో దాచి ఉంచిన 60 తులాల బంగారు ఆభరణాలు, రూ. 8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గోపాల్‌శర్మ కూతురు హైదరాబాద్‌లో ఉంటుంది. పాఠశాలకు 4 రోజులు సెలవులు రావడంతో గోపాల్‌శర్మ కూతురుని చూసేందుకు ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. అలాగే హైదరాబాద్ నుంచి మిత్రుడి పదవీ విరమణకు విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇంటికి అతడు వేసిన తాళం రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశారు. దీంతో బీరువాలోని దుస్తులు, వస్తువులు చెల్లాచెదురుగా పడి వుండడం గమనించి లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా డోన్ రూరల్ ఎస్‌ఐ చంద్రబాబునాయుడు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అలాగే క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఇంట్లో అనువణువునూ పరిశీలించి ఆధారాలు సేకరించారు. కాగా గత ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న 60 తులాల బంగారం ఆభరణాలు, రూ. 8లక్షల నగదును దొంగలు ఎత్తుకుపోయారని, మీరే న్యాయం చేయాలని గోపాల్‌శర్మ పోలీసుల ఎదుట లబోదిబోమన్నాడు. ఇదిలా ఉండగా ఇంట్లో అంత నగదు, నగలు పెట్టి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.