క్రైమ్/లీగల్

కెనాల్‌లో పడిన వ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 20: ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువా రం తెల్లవారు జామున ఒక వ్యాన్ కెనాల్‌లో పడిపోయింది. వ్యాన్‌లో ఉన్న ఏడుగురు పిల్లలు నీట మునిగిపోయారని భావిస్తున్నారు. మరో 22 మందిని రక్షించారు.
29 మందితో కూడిన ఒక పికప్ వ్యాన్ లక్నో నగర శివారులో గల నాగ్‌రాం ప్రాంతంలో ఇందిరా కెనాల్‌లో పడిపోయిందని లక్నో జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. బాధితులు పొరుగున గల బారాబంకి జిల్లాలో ఒక వివాహానికి హాజరయి వ్యాన్‌లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 29 మందిలో 22 మందిని రక్షించడం జరిగింది. ప్రమాదం జరిగి 12 గంటలయినా మరో ఏడుగురు పిల్లల ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. వీరంతా అయిదు నుంచి పదేళ్ల లోపు వయసు గలవారేనని వారు వివరించారు. కెనాల్‌లో నీటి ప్రవాహం వేగంగా ఉండటం వల్ల వారంతా కొట్టుకు పోయి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన స్థలం వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. గల్లంతయిన కొందరు పిల్లల తల్లిదండ్రులు వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని ఆరోపించారు. ‘మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా వ్యాన్‌ను నడిపాడని, ఒక వంపు వద్ద వ్యాన్‌ను తిప్పుతుండగా, అది అదుపు తప్పి కెనాల్‌లో పడిపోయిందని ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రుల్లో ఒకరు లాజావతి పేర్కొన్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని వచ్చిన ఆరోపణపై విచారణ జరిపిస్తున్నామని, అతను మద్యం సేవించి ఉన్నాడా? అనే విషయాన్ని నిర్ధారించడానికి అతడిని వైద్య పరీక్షకు పంపించామని మోహన్‌లాల్‌గంజ్ తహసీల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తెలిపారు.
వ్యాన్ కెనాల్‌లో పడిన సమయంలో మితిమీరిన వేగంతో ఉందని జిల్లా మేజిస్ట్రేట్ కూడా తెలిపారు. అయితే, అతను మత్తులో ఉన్నాడా? లేదా? అనేది తెలియదని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ పారిపోలేదని, ప్రయాణికులను రక్షించడంలో సహకరించాడని శర్మ తెలిపారు. గల్లంతయిన పిల్లలను మాన్సి(4), మనీషా(5), సౌరభ్(8), సచిన్(6), సజన్(8), అమన్(9)గా గుర్తించారు. మరొకరి పేరు తెలియరాలేదు.