క్రైమ్/లీగల్

ట్రక్ డ్రైవర్ కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బందా, జూన్ 20: సెక్యూరిటీ గార్డులు ఒక ట్రక్ డ్రైవర్‌ను కాల్చి చంపిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకొంది. హమీర్‌పూర్ జిల్లాలో గురువారం ఒక ర్యాంప్ నుంచి ఇసుకను తీసుకెళ్తూ తమకు ‘మామూలు’గా ఇవ్వాల్సిన 50 రూపాయిలకు బదులు ట్రక్ డ్రైవర్ 30 రూపాయిలు మాత్రమే ఇవ్వడంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డులు సదరు డ్రైవర్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు చెప్పారు. తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఎస్‌హెచ్‌వో సిసోలర్, రాకేష్‌కుమార్ పాండే తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. బుల్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంప్ వద్ద సెక్యూరిటీ తమకు లంచంగా 50 రూపాయిలు కాకుండా 30 మాత్రమే చెల్లించడంతో అరుణ్‌కుమార్ (22) అనే ట్రక్ డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెక్యూరిటీ గార్డులు అరుణ్‌కుమార్‌పై కాల్పులు జరపడంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. అరుణ్‌కుమార్ తండ్రి పిర్యాదు మేరకు ర్యాంప్ యజమానితో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి చెప్పారు. అరుణ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.