క్రైమ్/లీగల్

నా భర్తకు ఏ శిక్ష విధించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: 27 సంవత్సరాల క్రితం ఒక సైనికుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టుమార్షల్ చెప్పిన తీర్పుపై ఇంతవరకూ ఎటూ తేలలేదని, దీనిపై తుది నిర్ణయం వెలువరించాలని కోరుతూ అతని భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. లాన్స్‌నాయక్ దేవేంద్ర నాథ్ రాయ్ 1991, జూన్ 15న, ఇద్దరు తన సహచర సైనికులపై కాల్పులు జరిపి హతమార్చిన ఆరోపణలపై అప్పట్లో తక్షణమే అదుపులోకి తీసుకొని కోర్టు మార్షల్ నిర్వహించారు. విచారణ అనంతరం జనరల్ కోర్టు మార్షల్ (జీసీఎం) దేవేంద్ర నాథ్ రాయ్‌కు మరణశిక్ష విధించింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నిర్ధారించింది. కాగా 2000లో దేవేంద్రనాథ్ రాయ్ దీనిపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు నేరాన్ని నిర్ధారించింది. కానీ మరణశిక్ష విధింపును పక్కన పెట్టింది. జీసీఎం ప్రత్యేక కారణం ఏదీ చూపనందువల్ల, నెలకొన్న దారుణ పరిస్థితులను చక్కదిద్దాలని సైన్యానికి సూచించింది. కాగా 2006, జనవరి 10న కేంద్రం దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటినుంచి వేర్వేరు కారణావల్ల కేసు పెండింగ్‌లో కొనసాగుతోంది.
27 సంవత్సరాలనుంచి తన భర్త జైల్లోనే మగ్గుతున్నాడని, కనీసం బెయిల్ మంజూరు చేయడమో లేదా పేరోల్ ఇవ్వడం వంటివి కూడా చేయలేదని రాయ్ భార్య సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే అతనికి విధించిన జైలుశిక్షాకాలం ముగిసినందువల్ల, 1991 నాటి జనరల్ కోర్టుమార్షల్‌ను కొట్టివేయాలని కోరింది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌తో కూడిన దర్మాసనం, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ, ఆర్మీ చీఫ్‌కు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది.