క్రైమ్/లీగల్

అద్దె కార్లు తనఖా పెట్టే మోసగాళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కార్ల యజమానులను మాయమాటలతో నమ్మించి అద్దెకు తీసుకుని, ఆనక వాటిని తనఖా పెట్టి జల్సా చేస్తున్న ఇద్దరు ఘరానా మోసగాళ్లను అనంతపురం త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 29 కార్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో ఆదివారం జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన జయచంద్రారెడ్డి ఎంబీఏ చదువుకుని జిల్లాలోని ధర్మవరం పట్టణంలో కాంట్రాక్టర్‌గా పని చేస్తుండేవాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం బూర్గుల గ్రామానికి చెందిన దర్శి దినేష్ బీ.టెక్ పూర్తిచేసి ఓ బ్యాంకులో పని చేస్తూ సస్పెండ్ అయ్యాడు. స్నేహితులైన వీరిద్దరూ వ్యసనాలు, జల్సాలు తీర్చుకోవడానికి కార్ల యజమానులను నమ్మించి అద్దెకు తీసుకుని తనఖా పెడుతుండేవారు. ఈ క్రమంలో వారిపై నగరంలోని వన్, టూ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. దీంతో అనంతపురం డీఎస్పీ పీఎన్.బాబు పర్యవేక్షణలో త్రీ టౌన్ సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ జయపాల్‌రెడ్డి, ఏఎస్‌ఐ రమణ, సిబ్బంది నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిపై సస్పెక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. కార్లను కోర్టుకు అప్పగిస్తామని, యజమానులు తగిన రికార్డులు కోర్టుకు సమర్పించి తమ కార్లు తీసుకెళ్లవచ్చని ఎస్పీ వివరించారు.