క్రైమ్/లీగల్

వాహనం ఢీకొని మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 24: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఆదర్శ్‌నగర్, నౌబత్‌పహాడ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్, మీనా కుమారి(40) దంపతులు ఆదివారం రాత్రి తమ హోండా యాక్టీవాపై ఆనంద్‌నగర్ కాలనీలోని వారి బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఖైరతాబాద్ చౌరస్తాలో ఓ గుర్తుతెలియని వాహనం వీరి ప్రయాణిస్తున్న యాక్టీవాను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. భర్త ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.