క్రైమ్/లీగల్

పేటమున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌పై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూన్ 24: పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద తన అనుచరులతో అనుచితంగా ప్రవర్తించిన మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌పై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌడీ షీటు నమోదు అయిన వారు ఫోటోలు సేకరించే పనిలో భాగంగా పట్టణ ఎస్‌ఐ ధర్మరాజు చైర్మన్ రాజగోపాల్‌కు ఫోన్ చేసి ఫోటోలు కావాలని అడిగారు. ఈ విషయమై చైర్మన్ రాజగోపాల్ తన అనుచరులతో స్టేషన్ వద్దకు వెళ్లి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాజకీయపరంగా నమోదైన కేసులపై ఇలా వ్యవహరించడం సరికాదంటూ చైర్మన్ నిరసన వ్యక్తం చేశారు. సీఐ నబీ, ఎస్‌ఐ ధర్మరాజు ఎంత నచ్చజెప్ప చూసినా చైర్మన్ అనుచరులు అనుచితంగా ప్రవర్తించారని, స్టేషన్ సెంట్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్ రాజగోపాల్‌పైనా, ఆయన అనుచరులపైనా కేసు నమోదు చేసినట్లు సీఐ నబీ తెలిపారు.