క్రైమ్/లీగల్

రీసైక్లింగ్ చేస్తున్న 250 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూన్ 24: నల్లగండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ స్టేజీ సమీపంలోని అవిరినేని యాదగిరిరావు అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద ఉన్న షెడ్‌లో అక్రమంగా నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేస్తున్న సుమారు 250 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని సోమవారం విజిలెన్స్, పౌరసరఫరా శాఖల అధికారులు ఉమ్మడిగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విజిలెన్స్ సీఐ చలమందరాజు తెలిపిన ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి. విజిలెన్స్ ఎస్పీ బాలకిషన్‌రావు ఆదేశాల మేరకు తమకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో సోమవారం తెల్లవారుజామున గుంటిపల్లి స్టేజీ సమీపంలోని యాదగిరి రావు వ్యవసాయ బావి వద్ద ఉన్న రేకుల షెడ్‌పై దాడి చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ఉన్న వ్యక్తులు తాము వస్తున్న విషయాన్ని గమనించి ఘటనా స్థలం వద్దనే ఏపీ 9 ఏడబ్ల్యు 1521 నెంబర్ గల కారు, బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ 22 టీ ఏ 2278 నెంబర్ గల బొలేరో వాహనంతో పాటు నెంబర్ లేని హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయినట్టు చెప్పారు. రేకులషెడ్‌లోని మూడు గదులను వెతకగా 25 కిలోల తూకం ఉన్న 286 బస్తాలు, 50 కిలోల బరువు ఉన్న 42 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చలమందరాజు తెలిపారు. పట్టుకున్న బస్తాల తూకం దాదాపు 250 క్వింటాళ్ళ వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఘటనా స్థలంలో రేషన్ బియ్యాన్ని 25 కిలోల బస్తాలలోకి మార్చేందుకు వినియోగించేందుకు తీసుకొచ్చిన 25 కిలోల ఖాళీ బస్తాలు, బియ్యం బస్తాలను సీల్ చేసేందుకు వినియోగించే రెండు కుట్టుమిషన్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చలమందరాజు తెలిపారు. భూమి యజమాని అవిరినేని యాదగిరిరావును విచారించగా తన షెడ్‌ను దేవరకొండ పట్టణానికి చెందిన నరేశ్, కల్వకుర్తికి చెందిన సంతోష్ అనే వ్యక్తులు 6న కిరాయికి తీసుకున్నారని ఇక్కడ జరుగుతున్న విషయం తనకు తెలియదని వాంగ్మూలం ఇచ్చాడని సీఐ తెలిపారు. నరేశ్, సంతోష్ ఇదరూ పరారీలో ఉన్నారని వీరిద్దరు కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగాతరలిస్తూ గతంలో పట్టుబడ్డారని చెప్పారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై గోదాంకు తరలించి భూ యజమాని యాదగిరిరావు, వ్యాపారులు సంతోష్, నరేశ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చందంపేట పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు విజిలెన్స్ సీఐ చలమందరాజు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్‌ఐ ఎస్ కె గౌస్, డీటీసీ ఎస్ రఘునందన్, ఆర్ ఐ ప్రభుదాస్, విజిలెన్స్ సిబ్బంది కోయ నర్సింహ్మారెడ్డి, బి శ్యాంసుందర్‌రెడ్డి, కె నర్సింహ్మ, జి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యం బస్తాలు