క్రైమ్/లీగల్

మహిళను వేధించిన ఇద్దరికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 25: ఉప్పల్ రింగ్ రోడ్డు బస్టాప్‌లో నిల్చొన్న మహిళను వేధించిన ఇద్దరు వ్యక్తులకు ప్రత్యేక కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ రవిబాబు తెలిపారు.
నాచారం రాఘవేంద్రకాలనీలో నివసిస్తున్న రేపల్లె అనీల్ (23), ఉప్పల్ చిల్కానగర్‌లో నివసిస్తున్న యు.నాగేశ్వర్ రావు (24) మంగళవారం బస్టాప్‌లో వేచియున్న విజయపురికాలనీకి చెందిన మహిళను వేధిస్తుండగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేయగా కోర్టు పై తీర్పును విధిస్తూ రూ.50 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.