క్రైమ్/లీగల్

పేర్వారానికి సిటీ సివిల్ కోర్టు వారంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: పేర్వారం రాములు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన సమయంలో శంషీర్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం మాధవరెడ్డిని వేధించిన కేసుకు సంబంధించి సిటీ సివిల్ కోర్టు తాజాగా పేర్వారం రాములకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. 2001లో పేర్వారం రాములు తనను అక్రమంగా పీడీ చట్టం కింద అరెస్టు చేయించి చంచల్‌గూడ జైలులో పెట్టారని మాధవరెడ్డి కోటి రూపాయిల మేరకు పరవు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ పూర్తి అయిన తర్వాత మాధవరెడ్డిని అన్యాయంగా జైలులో ఉంచారన్న విషయాన్ని గుర్తించిన న్యాయస్థానం ఆయనకు 75 లక్షల రూపాయిల మేర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెల్లించి, ఆ మొత్తాన్ని పేర్వారం రాములు నుండి రికవరీ చేయాలని 2017లో ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో మళ్లీ మాధవరెడ్డి కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు పేర్వారం రాములుకు వారెంట్లు జారీ చేసింది. సిటీ సివిల్ కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది.