క్రైమ్/లీగల్

వంద కేజీల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుపాళ్యం, జూన్ 25: అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్సై రామకృష్ణ తెలిపారు. మండలంలోని నలగాంపల్లి జాతీయ రహదారిపై మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా నెల్లూరు నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న టాటా సుమోను స్వాధీనం చేసుకొని డ్రైవర్ శివయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో సుమారు వంద కేజీల గంజాయి ఉన్నట్లు చెప్పారు. దీని విలువ లక్షల్లో ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో చలపతిరెడ్డి, వీ ఆర్‌వో వెంకటేశ్‌లు పాల్గొన్నారు.