క్రైమ్/లీగల్

అంగన్‌వాడీ బాలికపై విద్యార్థి అత్యాచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూన్ 25: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో అంగన్‌వాడీ బాలికపై ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు మంగళవారం ఆలస్యంగా ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 17న పెంట గ్రామంలో అంగన్‌వాడీ బాలికపై విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు మంగళవారం రంగ ప్రవేశం చేసి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి గురైన నాలుగున్నర ఏళ్ల బాలిక స్థానిక అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంటుంది. విద్యార్థి ఒక ప్రైవేట్ ఐటిఐలో ఎలక్ట్రీషియన్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. ఈనెల 17న ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలికపై విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో బాలికను సోమవారం రాత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ డి.మోహనరావు తెలిపారు.