క్రైమ్/లీగల్

టవర్ కార్‌ను ఢీకొన్న శ్యామలేశ్వరి ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోకి వచ్చే సింగపూర్ రోడ్డు, కేట్‌గుడ రైల్వే సెక్షన్ల మధ్య రాయగడకు సమీపాన మంగళవారం సాయంత్రం టవర్ కార్‌ను హౌరా-జగదల్‌పూర్ (18005)ల మధ్య నడిచే శ్యామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ సంఘటనలో ఎక్స్‌ప్రెస్ ఇంజన్ ధ్వంసమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా రైల్వేకు సంబంధించిన ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. రాయగడకు చెందిన ఎలక్ట్రికల్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సాగర్, ఎలక్ట్రికల్ టెక్నిషీయన్ గౌరినాయుడు, టవర్ కార్ మెయింట్‌నెన్స్ టెక్నిషీయన్ సురేష్ మృతిచెందినట్టు అదికారులు నిర్ధారించారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న రైల్వేబోర్డు విచారణకు ఆదేశించింది. సింగపూర్‌రోడ్డు, కేట్‌గుడ స్టేషన్ మాస్టర్లపై చర్యలు తీసుకున్నట్టు అదికారులు తెలిపారు.