క్రైమ్/లీగల్

తూ.గో.లో ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్కవోలు, జూన్ 25: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అదుపుతప్పిన ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. ముందువెళుతున్న ఒక కారును ఢీకొని, ఆపై ఒక బైక్‌పైకి దూసుకువెళ్లి, మరో స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు మృతిచెందగా, అదే బైక్‌పైవున్న బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారులోని వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, స్కూటర్‌పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో బస్సులోని 20మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనపర్తి నుంచి రామచంద్రపురం వెళుతున్న రామచంద్రపురం డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం బిక్కవోలు మండలంలోని తొస్సిపూడి సాయితేజ రైస్ మిల్లు వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళుతున్న కారును ఢీకొని, అనంతరం ఒక బైక్ పైనుండి వెళ్లిపోయి, మరో స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పక్కనేవున్న పంటకాలువలోకి దూసుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న కొమరిపాలెం గ్రామానికి చెందిన కేపీఆర్ సంస్థల డైరెక్టర్ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై ప్రయాణిస్తున్న తొస్సిపూడి గ్రామానికి చెందిన కర్రి అభిరామ్(19) అక్కడికక్కడే మృతిచెందాడు. అదే బైక్‌పై వున్న తీవ్రంగా గాయపడిన తమలంపూడి సాయి సతీష్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బైక్‌పైనే ఉన్న సతీష్ చిన్నాన్న కుమారుడు అజయ్‌కుమార్‌రెడ్డి అనే బాలుడి తలకు తీవ్రగాయమయ్యింది. అతడి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మరో ద్విచక్రవాహనంపై ఉన్న అనపర్తి మండలం పీరారామచంద్రపురానికి చెందిన శ్రీనివాస్, శ్రీను స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న అనపర్తి సీఐ ఎంవీ భాస్కరరావు, బిక్కవోలు ఎస్సై వై.గణేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ఏరియా అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం...బస్సు ఢీకొని బోల్తాపడిన కారు