క్రైమ్/లీగల్

పెళ్లి ఇంట్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఏప్రిల్ 1: మూడు గంటల్లో పెళ్లి ఉండటంతో పనుల కోసం నీళ్లు పడుతుండగా కరెంట్ షాక్‌తో పెళ్లికొడుకు తండ్రి అక్కడికిక్కడే మృతిచెందాడు. సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంప్లెక్స్ సెంటర్‌లోని హుడా ఓపెన్ ఆడిటోరియం వెనకాల చోటుచేసుకుంది. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బచ్చనబోయిని నర్సింహా యాదవ్(52) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి వనస్థలిపురంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు యుగేందర్ వివాహం ఆదివారం ఉదయం ఉండటంతో ఇంటినిండా చుట్టాలు ఉన్నారు. తెల్లవారుజామున 4గంటల సమయంలో నిద్రలేచిన నర్సింహ నీళ్లు పట్టడానికి బోరింగ్ వేసి బకెట్‌తో నీళ్లు మోస్తున్నాడు. శనివారం రాత్రి డిజైన్ లైట్లు వేసిన ఎలక్ట్రీషియన్.. కరెంట్ వైర్లను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ వైర్లకు ఉన్న కరెంట్ షాక్ తగిలిన నర్సింహ అక్కడికిక్కడే మృతిచెందాడు. పెళ్లి బాజా మోగుతున్న ఇంట్లో ఒక్కసారిగా చావుబాజా వినిపించడంతో వచ్చిన చుట్టాలు, స్థానికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కంపెనీలో మంటలు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 1: షాట్‌సర్క్యూట్‌తో కం పెనీలో మంటలంటుకొని పూర్తిగా దగ్ధమైన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలోని శాలిమార్ కొబ్బరి నూనె కంపెనీలో ఆదివారం మంటలంటుకున్నాయి. కంపెనీ పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో అందులో మిషన్‌లు ధ్వంసమయ్యాయి. మంటల్లో ముడిసరుకులతో పాటు కొబ్బరినూనె ప్యాకెట్‌లు, కొబ్బరి నూనె డబ్బాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు.