క్రైమ్/లీగల్

భార్యపై హత్యాయత్నం కేసులో భర్త, ప్రియురాలికి ఐదేళ్లు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 26: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తతోపాటు మరో మహిళకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చిట్టినగర్ లంబాడీపేటకు చెందిన జక్కా పద్మజాకు నరేష్‌కుమార్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త బంగారం పని చేస్తుంటాడు. భార్య ప్రైవేటు స్కూలులో టీచర్. కాగా భర్త నరేష్ చిట్టినగర్‌కు చెందిన షేక్ రెహేనా అనే మహిళతో మూడేళ్లుగా అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. దీంతో ఈ విషయమై భార్య భర్తల మధ్య తరచూ గొడవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో నరేష్ తన ప్రియురాలితో కలిసి పథకం వేసుకుని నమ్మకంగా భార్యను కొండపల్లి ఖిల్లా వద్దకు తీసుకువచ్చి 2015 సెప్టెంబర్ 18న చంపేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న భార్య పద్మజా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్త నరేష్‌తోపాటు ప్రియురాలు రెహానాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 9మంది సాక్షులను విచారించిన మీదట నేరం రుజువుకావడంతో ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలుశిక్ష, రూ.1000ల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.