క్రైమ్/లీగల్

అనుమతి లేకుండా ప్రచారం.. రూ. 7వేలు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: ప్రముఖు వ్యక్తుల ఫోటోలను, వారి పేర్లను అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న ఒక షాపు యజమానికి రూ. 7 వేలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సుల్తాను బజార్‌లో హేమంత్ శారీ స్టోర్‌పై హీరోయిన్ శృతి ఫొటోను వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఉస్మానియా వర్సిటీ విద్యార్థి తెలంగాణ ఫోరానికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఫోరమ్ అధికారులు సదరు షాపు యజమానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై షాపు యజమానులు హీరోయిన్ ఫొటోను వాడుకోవడానికి తమకు ఎలాంటి అనుమతులు లేవని, ఇక నుంచి ఫొటోను వాడుకోమని ఫోరమ్‌కు చెప్పుకున్నారు. అయితే, ఫోటోను వాడుకున్నందుకు షాపు యజమానికి ఫోరమ్ రూ. 7వేల రూపాయలు జరిమానా విధించింది.