క్రైమ్/లీగల్

తిరుమల మణిమంజరి అతిథిగృహంలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 3: తిరుమలలో అత్యంత ప్రముఖులు బసచేసే పద్మావతి అతిథిభవనాల సముదాయంలోని మణిమంజరి అతిథిభవనంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. 10తులాల బరువు కలిగిన వజ్రాలు పొదిగిన ఆభరణాలు, రెండులక్షల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను చోరీ చేసుకెళ్లారు. బాధితులు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బంధువులు అని తెలిసింది. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోనికి దింపారు. అతిథిభవనం ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు క్రైమ్ సీ ఐ కొండయ్య తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదుకు చెందిన విజయసేనారెడ్డి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి 13మంది శ్రీవారి దర్శనార్థం మంగళవారం నాడు తిరుమలకు వచ్చారు. మణిమంజరి అతిథిభవనంలో మూడు గదులు అద్దెకు తీసుకున్నారు. బుధవారం ఉదయం వారు విఐపీ దర్శనం ద్వారా స్వామిని దర్శించుకోడానికి ఆలయానికి వెళ్లారు. మంగళవారం రాత్రి 11గంటల పైన బుధవారం తెల్లవారుజామున 3గంటల లోపు గుర్తుతెలియని దొంగలు అతిథిభవనం వెనుకభాగం నుండి గదిలోనికి ప్రవేశించి నగలు, నగదు, సెల్‌ఫోన్‌ను చోరీ చేసుకుని పారిపోయారు. ఈ సందర్భంగా బాధితులు విజయసేనారెడ్డి మాట్లాడుతూ 13మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి శ్రీవారి దర్శనానికి వచ్చి మణిమంజరిలో బస చేశామన్నారు. మంగళవారం రాత్రి 11గంటల వరకు తాము మెళకువగానే ఉన్నామన్నారు. తెల్లవారుజామున ఐదుగంటలకు వి ఐ పీ దర్శనానికి బయలుదేరామన్నారు. తిరిగి వచ్చి హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమయ్యామన్నారు. ఆ సమయంలో ఈ చోరీ విషయం గుర్తించామన్నారు. స్వామి దర్శనానికి వెళ్లే తొందరలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగిన విషయాన్ని గుర్తించలేదన్నారు. చోరీ జరిగిన అనంతరం అతిథిభవనం ఇన్‌చార్జిగా ఉన్న చినబాబు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. ఒక పర్సులో ఉన్న డబ్బు, ఆభరణాలు తీసుకున్న చోరులు, ఖాళీ పర్సును తమకు చెందిన తాళాలను బయటపడేసి వెళ్లిన విషయాన్ని పోలీసులు గుర్తించారన్నారు. గత 50సంవత్సరాలుగా తాను యేడాదికోమారు తిరుమలకు వస్తున్నానన్నారు. అయితే ఏ రోజు గదుల్లో దొంగతనాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. తమ పర్సుల్లో డబ్బుందన్న విషయం బయటవారికి తెలిసే అవకాశం లేదని, ఇక్కడ ఉన్న వారిపైనే తమకు అనుమానం ఉందని వారిని విచారించామన్నారు. తమ డబ్బు పోయిందని తాము చెప్పడం లేదని, ఇలాంటి ప్రముఖులు బస చేసే చోట దొంగతనాలు జరగడంతో టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుందన్నది తమ ఆవేదన అన్నారు. అందుకే ఈ చోరీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని కోరుకుంటున్నామన్నారు. కాగా క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.