క్రైమ్/లీగల్

వాచ్‌మన్ రంగయ్యకు సత్యశోధన పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూలై 3: మాజీ మంత్రి వై ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు అనుమానితులందరినీ రహస్యంగా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్యకు సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాచ్‌మన్ రంగయ్యను నార్కో, పాలిగ్రామ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని సిట్ అధికారులు పులివెందుల కోర్టును కోరినట్లు సమాచారం. దీనికి కోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో సత్యశోధన పరీక్షల కోసం రంగయ్యను హైదరాబాద్‌కు తరలించారని సమాచారం. వివేకా హత్య జరిగినప్పటి నుంచి పోలీసులు అనేకమంది అనుమానితులను విచారించారు. రంగయ్య వెల్లడించే వాస్తవాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితులను గుర్తించేందుకు వీలు కలుగుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గతంలో వివేకా కారు డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరిన సిట్ బృందంలో సభ్యుడైన పెనుగొండ డీఎస్పీ రామకృష్ణ, పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో రహస్యంగా విచారించారు.