క్రైమ్/లీగల్

భారీగా బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: జెడ్డా నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా అక్రమ మార్గంలో బంగారాన్ని తరలించే ప్రయత్నలో14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి 6.5 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ. 2. 20 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. జెడ్డా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తున్న సమాచారం ముందుగా హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులకు తెల్సింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందించారు. డీఆర్‌ఐ, టాస్క్‌పోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 14 మంది వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6.5 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.