క్రైమ్/లీగల్

నేషనల్ హైవే స్టోర్ రూమ్ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, జూలై 3: జాతీయ రోడ్డు నిర్మాణాకినికి సంబంధించిన స్టోర్ రూమ్ ఆగ్నికి ఆహుతి కావడంతో సుమారు ఐదుకోట్ల రూపాయల అస్తినష్టం జరిగింది. చిత్తూరు జిల్లా పూతల పట్టు వద్ద ఈ ఘటన బుధవారం జరిగింది. జిల్లాలో చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కెఎన్‌ఆర్ కనస్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తోంది. దీనికోసం పూతలపట్టు మండల పరిధిలో ఇటుకురాళ్లపల్లి వద్ద ప్రత్యేకంగా స్టోర్‌రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఆయిల్, వాహనాల టైర్లు, కేబుల్ వైర్లు ఇతర యంత్రాలు, పరికరాలు నిల్వ చేసారు. దీని పక్కనే క్వారీ యంత్రాలు ఏర్పాటుచేసారు. బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఒక్కసారిగా అయిల్ క్యాన్లకు అంటుకోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. స్టోర్‌రూమ్‌లోని వస్తువులతోపాటు క్యారీ యంత్రాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో కార్మికులు అంతా బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం జరగలేదు. స్టోర్‌రూమ్ గ్రామానికి దూరంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పాకాల అగ్నిమాపక సిబ్బంది మంటలను అతికష్టంపై అదుపు చేసారు. సంఘటనా స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ రామాంజనేయలు పరిశీలించారు.