క్రైమ్/లీగల్

నాలుగు వారాల్లో బదులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: దేశవ్యాప్తంగా తాజాగా అంచనాలు వేయకుండా 358 గనులలో నుంచి ఇనుప ఖనిజం తవ్వకాల కోసం వివిధ సంస్థలకు ఇచ్చిన లీజు కేటాయింపులు, పొడిగింపులు, కొనసాగింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై నాలుగు వారాలలోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఇది సుదీర్ఘంగా విచారించాల్సిన అంశమని పేర్కొంటూ, దీనిని నాన్-మిస్‌లేనియస్ అంశాలు విచారించే రోజున లిస్టింగ్ చేసింది. చట్టబద్ధంగా అనుసరించవలసి ఉన్న ప్రక్రియను అనుసరించకుండా గనుల లీజులను మంజూరు చేశారని లేదా పొడిగించారని న్యాయవాది అయిన పిటిషనర్ ఎంఎల్ శర్మ వాదించారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్‌ఎస్ నడ్‌కామి కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్ దురుద్దేశంతో దాఖలయిందని, దీనికి సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇనుప ఖనిజం గనుల కేటాయింపులు, పొడిగింపులపై దర్యాప్తు జరపడానికి వీలుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఆదేశించాలని కూడా శర్మ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో తనకు సహకరించడానికి ఇప్పటికే న్యాయవాది పీఎస్ నరసింహను అమికస్ క్యూరీగా నియమించింది.
288 ఇనుప ఖనిజం గనుల లీజులను రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చినందుకు బదులుగా పొడిగించారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా రూ. నాలుగు లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ విషయం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తన దృష్టికి వచ్చిందని శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజా మదింపులు వేయకుండా, వేలం ప్రక్రియను అనుసరించకుండా 358కి పైగా గనులను ఇనుప ఖనిజం తవ్వకాలకు లీజుకు ఇవ్వడమో, లీజులను పొడిగించడమో చేశారని పిటిషనర్ తన పిటిషన్‌లో తెలిపారు.