క్రైమ్/లీగల్

ఆ అభ్యర్థులు ‘జనరల్’లోకి రాజాలరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: ఎంపిక ప్రక్రియలో గరిష్ఠ వయోపరిమితి సడలింపు పొందిన రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థి తరువాత జనరల్ కేటగిరిలో ఉద్యోగాన్ని పొందజాలడని సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్.అబ్దుల్ నజీర్, ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం గుజరాత్ హైకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గరిష్ఠ వయోపరిమితి సడలింపు పొందిన రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థి జనరల్ కేటగిరిలో ఉద్యోగం పొందడానికి వీలు లేదని, సదరు రిజర్వుడ్ కేటగిరిలోనే ఉద్యోగం పొందాలని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన ఎంపిక ప్రక్రియను హైకోర్టు సమర్థించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నీరవ్ కుమార్ దిలీప్ భాయ్ మక్వానా అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది.