క్రైమ్/లీగల్

చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 4: ఓ కామాంధుడు నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు. పొరుగింట్లో ఉంటున్న పాపకు చాకెట్ల్ కొనిస్తానని చెప్పి వెంట తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతపురం నగరంలోని ఎర్రనేల కొట్టాలు (మహాత్మాగాంధీ కాలనీ)లో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబం నివసిస్తున్న ఇంటి పక్కనే ఉంటున్న కిరణ్(37) ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. గురువారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.మూడవ పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రనేల కొట్టాలకు చెందిన చిన్నారి తల్లిదండ్రులు రోజువారీ జీవనోపాధికి వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు. పనికి వెళ్లినప్పుడు చిన్నారిని పక్కింటివాళ్ల వద్ద వదిలివెళ్లేవారు. పక్కింట్లో ఉంటున్న కిరణ్ పనీపాటాలేకుండా తాగుబోతుగా మారి జులాయిగా తిరిగేవాడు. బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పీకలదాకా మద్యం తాగిన ఆ కామాంధుడు చాక్లెట్ కొనిస్తానని చెప్పి పాపను తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పాపను వారి ఇంటివద్ద వదిలేశాడు. పనిముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు పాప ఏడుస్తూ ఉండడంతో ఏం జరిగిందని ఆరా తీశారు. జరిగిన ఘోరం తెలుసుకుని వారు విలవిల్లాడారు. పాపకు అధిక రక్తస్రావం కావడం గమనించి వెంటనే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. పాపకు స్కానింగ్, కల్చర్ పరీక్షలు చేశామని, నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్, మైక్రోబయాలజీ విభాగాలకు పంపామని ప్రభుత్వ సర్వజనాస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మీ తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు గురువారం మూడవ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు ఆస్పతి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. నిందితుడిని నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సావిత్రమ్మ, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నల్లాని రాజేశ్వరి బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.