క్రైమ్/లీగల్

ఔటర్ రింగురోడ్డుపై కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జులై 4: ఔటర్‌రింగు రోడ్డుపై ఓ వ్యక్తి తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగ్ ఔటర్‌రింగు రోడ్డు వద్ద ఓ వ్యక్తి బెంజ్ కారు (టీఎస్ 09యూబీ 6040) లో వచ్చాడు. కారులో వచ్చిన వ్యక్తి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియరావాల్సి ఉందన్నారు. అనంతరం ఇటివలే సదరు కారు నో పార్కింగ్ స్థలంలో పార్కు చేయడంతో కేసు బుక్ చేశారని, వివరాలను ఆధారంగా చేసుకొని విచారణ చేస్తామని తెలిపారు. వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.