క్రైమ్/లీగల్

లోకేష్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, జూలై 5: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ పోస్టులు పెట్టిన వారి వివరాలతో కూడిన సీడీని తాడేపల్లి సీఐ అంకమ్మరావుకు అందజేశారు. అనంతరం వర్ల రామయ్య విలేఖర్లతో మాట్లాడుతూ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ప్రభాకరరెడ్డి అనే ఎన్నారై.. నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాటలు, రాయకూడని పదజాలం, పుట్టుక, వైవాహిక జీవితం గురించి పోస్టులు పెట్టారని తెలిపారు. మే 19వ తేదీన ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన చర్చలో కూడా ప్రభాకరరెడ్డి పాల్గొన్నారని తెలిపారు. గతంలో రాష్ట్ర హోం మంత్రి, నర్సాపురం ఎంపీలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేశారని, అదే విధంగా లోకేష్‌పై పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఐదేళ్లు పరిపాలన చేయాలని, హామీ ఇచ్చిన నవరత్నాలు అందరికీ అందేలా చూడాలని జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అధికారం అప్పగించారన్నారు. అవన్నీ వదిలేసి భవనాలు కూలగొట్టుకుంటూ విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్వ ప్రభుత్వంలో ఎవరు అవినీతి చేశారో వెలికితీస్తే వారికి రివార్డులు ఇస్తామని చెప్తున్న ఇటువంటి సీఎంను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆరునెలల పాటు ప్రభుత్వాన్ని అడ్డుకోకుండా, విమర్శించకుండా వారి పాలన చూద్దామని అనుకున్నామని, కానీ ఆ పరిస్థితి అధికార పక్షం కల్పించడం లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలే తప్ప విధ్వంసంపై కాదని హితవుపలికారు. ఈ సమావేశంలో టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి, తాడేపల్లి పార్టీ పట్టణ, రూరల్ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, కొమ్మారెడ్డి కిరణ్, గుత్తికొండ ధనుంజయరావు, పెంచలయ్య, దొప్పలపూడి జ్యోతిబసు, బెజ్జం రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.