క్రైమ్/లీగల్

దేవాదాయ శాఖ చిత్తూరు ఆర్జేసీ భ్రమరాంబకు పతీ వియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 5: దేవదాయశాఖ చిత్తూరు ప్రాంతీయ సంయుక్త కమిషనర్ భ్రమరాంబ భర్త సీహెచ్‌వీఎస్ ప్రసాద్ (56) గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎల్‌ఐసీలో పనిచేస్తున్న ఆయన గురువారం విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా గోపాలపట్నం పెట్రోల్ బంకు సమీపంలో గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించిన ఆయన కారు పక్కకు తీసి ఆయనే స్వయంగా దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ప్రసాద్ మృతి చెందారు. ఆయనను ప్రహ్లాదపురంలోని ఇంటికి తరలించారు. చిత్తూరు జిల్లా ఆర్జేసీగా విధులు నిర్వహిస్తున్న భ్రమరాంబకు సమాచారం అందించడంతో ఆమె శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకుని భర్త మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరై విలపించారు. దేవదాయశాఖ విశ్రాంత కమిషనర్ అనూరాధ, విశ్రాంత అదనపు కమిషనర్ కృష్ణాజీ, ఏ.రాఘవాచార్యులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వినర్ అజశర్మ, సింహాచలం దేవాలయ వైదిక పెద్దలు, ఉద్యోగులు ప్రసాద్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. భ్రమరాంబను ఓదార్చి సానుబూతి వ్యక్తం చేశారు. సింహాచలంలోని శ్మశాన వాటికలో ప్రసాద్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు జరిగాయి.