క్రైమ్/లీగల్

లోక్‌సభ ఎన్నికల రద్దుపై పిల్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని ప్రశ్నిస్తూ లాయర్ ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖరు చేశారు. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని బెంచ్ పిల్‌పై విచారణ నిర్వహించింది. ఈ పిల్‌ను 3విచారణకు యోగ్యం కాని2 పిటిషన్‌గా అభివర్ణించింది. సుప్రీం కోర్టును ఏమి అడగాలనుకొన్నారు.. యావత్ లోక్‌సన ఎన్నికలకు మమ్నల్ని బాధ్యులను చేయాలని భావిస్తున్నారా? అంటూ శర్మను ప్రశ్నించింది. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని ప్రశ్నిస్తూ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని పిల్‌లో శర్మ పేర్కొన్నారు.
ఈవీఎంల ఖర్చు నాలుగు వేల కోట్లు
ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లను ఖర్చు చేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో సైతం ఈవీఎంల కోసం వెయ్యి కోట్ల రూపాయిలను కేటాయించింది. మొత్తంగా మూడు వేల 902.17 కోట్లను ఈవీఎంల నిమిత్తం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 11వ తేదీ మే 19వ తేదీ వరకు ఏడు విడతలుగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.