క్రైమ్/లీగల్

ముగిసిన బీసీ కమిషన్ బహిరంగ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: తెలంగాణలో వెనుకబడిన కులాలను గుర్తించేందుకు నియమించిన బీసీ కమిషన్ బహిరంగ విచారణ శుక్రవారంతో ముగిసింది. గత నెల 29వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు బీసీ కమిషన్ వెనుకబడిన కులాలకు సంబంధించిన వివరాలను సేకరించడానికి బహిరంగ విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వివిధ సామాజిక వర్గాలు ప్రభుత్వానికి సూచించాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల్లోకి ఏయే కులాలను తీసుకోవాలో తేల్చడానికి బీసీ కమిషన్ నియమించింది. శుక్రవారం బీసీ కమిషన్ ముందకు 20 కులాలు ప్రతినిధులు తమను బీసీ కులాల్లో చేర్చాలని వినతి పత్రం అందించాయి. ఇక బీసీ కులాలను క్షేత్రస్థాయిలో గుర్తించడానికి బీసీ కమిషన్ రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతోంది. గతంలో వివిధ కారణాలతో బీసీ కమిషన్ ముందుకు రాని కులాల ప్రతినిధులు శుక్రవారం హాజరై తమను బీసీ జాబితాలో చేర్చాలని కమిషన్‌ను కోరాయి. ఇతర బీసీ కులాలకు చెందిన ప్రతినిధులు ఈనెల 11న బీసీ కమిషన్ ముందు హాజరు కావాలని బీసీ కమిషన్ వెల్లడించింది.