క్రైమ్/లీగల్

ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్‌వో, వీఆర్‌ఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, జూలై 5: లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నల్లగొండ జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి, సుద్దాల, అంబాల గ్రామ వీఆర్‌వో నల్ల శ్రీను, సుద్దాల వీఆర్‌ఏ తుంగ యాదగిరి శుక్రవారం రైతు నుండి 42 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ అనంద్ కుమార్ తెలిపిన వివరాల మేరకు అంబాల గ్రామానికి చెందిన రైతు నర్రాముల చిన్న ఎల్లయ్య, సోదరుడు నర్సింహ్ములు తమ పాలివారి వద్ద 30 ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల 20గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. 2007లో ఎకరం భూమి మాత్రమే వారి పేరిట నమోదైందని మిగతా 3 ఎకరాల 20 గుంటల భూమితో పాటు మొత్తం 4.20 ఎకరాల భూమికి పట్టా పాస్ పుస్తకం ఇచ్చేందుకు వీఆర్‌వో, వీఆర్‌ఏలు రైతులను లంచం డిమాండ్ చేశారు. ఎకరానికి 12 వేల చొప్పున వారు లంచం అడిగారు. తాము అంత మొత్తం డబ్బులు ఇవ్వలేమని బతిమిలాడినా వినకపోవడంతో రైతులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచనల మేరకు రైతు ఎల్లయ్య 42 వేల రూపాయల లంచం సొమ్మును తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్‌వో, వీఆర్‌ఏలకు అందజేశారు. రైతుల నుండి లంచం సొమ్ము తీసుకుంటుండగా పొంచి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో పాటు రెడ్ హ్యాండెడ్‌గా వీఆర్‌వో, వీఆర్‌ఏలను పట్టుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని, నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ, ఎస్సైలు, రఘుబాబు, లింగస్వామి ఉన్నారు.